అక్రమంగా తరలిస్తున్న కస్టమ్ మిల్లింగ్ ధాన్యం స్వాధీనం
నేరేడుచర్ల : నేరేడుచర్లలో కస్టమ్ మిల్లింగ్ ధాన్యాన్ని డీసీఎం ద్వారా అక్రమంగా తరలిస్తుండగా సివిల్ సప్లయ్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. నేరేడుచర్లలోని తిరుమల రైస్ కార్పొరేషన్‌లో ఉన్న సీఎంఆర్‌ను డీసీఎం వాహనంలో గుర్తు తెలియని వ్యక్తులు తరలిస్తుండగా కొంత మంది సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. దీంతో తహసీల్దార్ సురగి సైదులు మిల్లు వద్దకు చేరుకొని ధాన్యాన్ని పరిశీలించి పౌరసరఫరాల అధికారులకు సమాచారం అందించారు. సివిల్ సప్లయ్ ఆర్‌ఐ ప్రమోద్ సంఘటన స్థలానికి చేరుకొని ధాన్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తిరుమల రైస్ కార్పొరేషన్‌పై గతంలో కేసులు నమోదు అయ్యాయని, ప్రస్తుతం మిల్లులో ఉన్న సుమారు 200 క్వింటాళ్ల ధాన్యాన్ని స్వాధీనం చేసుకొని గరిడేపల్లిలోని సునంద రైస్‌మిల్లుకు తరలిస్తున్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ మిల్లులో సీఎంఆర్ ఎంత నిల్వ ఉందో రికార్డులు అందుబాటులో లేవని, ప్రస్తుతం ఉన్న ధాన్యాన్ని స్వాధీనం చేసుకొని తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మిల్లులో సీఎంఆర్ సేకరించింది ఎంత..? ప్రస్తుతం ఎంత నిల్వ ఉంది, ఇప్పటివరకు ఎంత వరకు ఆక్రమంగా తరలించారనే అంఽశంపై రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు విచారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
యాదగిరిగుట్టలో నేడు రథసప్తమి వేడుకలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం రథ సప్తమి వేడుకలు నిర్వహించేందుకు అర్చకులు, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకల్లో భాగంగా వేకువజామునే ఆలయాన్ని తెరిచి సుప్రభాతం, అభిషేకం అనంతరం 6.30 గంటలకు స్వామివారిని సూర్యప్రభ వాహనంపై ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగిస్తారు. రాత్రి 7 గంటలకు స్వామి వారిని బంగారు రథంపై అధిష్టింపజేసి ఊరేగించనున్నారు. ఇందుకు అవసరమైన సూర్యప్రభ వాహనాన్ని, స్వర్ణ రథాన్ని శుభ్రం చేసి సిద్ధం చేశారు.
స్వామివారు ఊరేగనున్న బంగారు రథం
స్వామి వారి సూర్య ప్రభ వాహనం
సైన్యంలో చేరాలనుకుంటున్న వారికి శిక్షణ ఇస్తున్న సుంకర శ్రీనివాసరావు
అక్రమంగా తరలిస్తున్న కస్టమ్ మిల్లింగ్ ధాన్యం స్వాధీనం
అక్రమంగా తరలిస్తున్న కస్టమ్ మిల్లింగ్ ధాన్యం స్వాధీనం
అక్రమంగా తరలిస్తున్న కస్టమ్ మిల్లింగ్ ధాన్యం స్వాధీనం


