మంత్రి ఉత్తమ్ స్వగ్రామంలో కాంగ్రెస్ మద్దతుదారు విజయం
తిరుమలగిరి (తుంగతుర్తి) : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వగ్రామమైన తిరుమలగిరి మండలం తాటిపాముల సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి బోయపల్లి కృష్ణయ్య 510 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 12 వార్డుల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఏడుగురు, బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఐదుగురు విజయం సాధించారు.
మండలి చైర్మన్ సొంతూరులోనూ..
చిట్యాల : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్వగ్రామం చిట్యాల మండలం ఉరుమడ్లలో కాంగ్రెస్ బలపర్చిన సాగర్ల భానుశ్రీ సర్పంచ్‌గా గెలుపొందింది. గ్రామంలో 2979 ఓట్లుండగా 2729 ఓట్లు పోలయ్యాయి. భానుశ్రీకి 1465 ఓట్లు రాగా తన సమీప ప్రత్యర్థి బీఆర్‌ఎస్ మద్దతుదారు సుంకరబోయిన నీలమ్మకు 1205 ఓట్లు వచ్చాయి. దీంతో భానుశ్రీ 260 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. భానుశ్రీ అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ బరిలో నిలిచింది. ఉరుమడ్ల గ్రామంలో మొత్తం వార్డులు ఉండగా.. ఏడు వార్డుల్లో కాంగ్రెస్ మద్దతురారులు, మూడు వార్డుల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలుపొందారు.
మంత్రి కోమటిరెడ్డి ఊర్లోనూ కాంగ్రెస్
నార్కట్‌పల్లి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్వగ్రామమైన నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి చిరుమర్తి ధర్మయ్య.. బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి బుర్రి రాములుపై గెలుపొందారు. గ్రామంలో మొత్తం 2864 ఓట్లకు గాను 2479 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పట్టణాల నుంచి పల్లెలకు..
అర్వపల్లి : తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉపాధి కోసం పట్టణాలకు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు గురువారం పెద్దసంఖ్యలో తమ గ్రామాలకు తరలివచ్చారు. సర్పంచ్, వార్డు అభ్యర్థులు తమ సొంత ఖర్చులతో ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేసి తీసుకువచ్చారు. ఓటు వేసిన అనంతరం తిరిగి అదే వాహనాల్లో పంపించారు.
మంత్రి ఉత్తమ్ స్వగ్రామంలో కాంగ్రెస్ మద్దతుదారు విజయం


