విదేశాల నుంచి రాక..
అమెరికా నుంచి చీకటిగూడేనికి..
కేతేపల్లి : కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామ పంచాయతీకి చెందిన కోట రమ్య అమెరికా నుంచి వచ్చి గురువారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకుంది. ఈ సందర్భంగా రమ్య మాట్లాడుతూ.. ఓటు వేయడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రతి పౌరుడు తన బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
దుబాయి నుంచి పల్లెర్లకు..
ఆత్మకూరు(ఎం) : ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన గోరుపల్లి మల్లారెడ్డి దుబాయి నుంచి వచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జీవనోపాధి నిమి త్తం 14 ఏళ్ల క్రితం దుబాయికి వెళ్లిన మల్లారెడ్డి అప్పుడప్పుడు గ్రామానికి వస్తుంటారు. ఆయన కుటుంబ సభ్యులు గ్రామంలోనే ఉంటున్నారు. దుబాయి నుంచి నిన్న రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన గురువారం కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
విదేశాల నుంచి రాక..


