గుండ్లగూడెంలో ఇరువర్గాల తోపులాట
ఆలేరురూరల్ : గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆలేరు మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో గురువారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఓట్ల లెక్కింపు అనంతరం బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి ఏసీరెడ్డి లక్ష్మీమహేందర్‌రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఓట్ల లెక్కింపుపై తమకు అనుమానం ఉందని, అధికారులు రీకౌటింగ్ నిర్వహించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పంచాయతీ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాటతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల జోక్యం చేసుకొని ఇరువర్గాలను నియంత్రించారు. ఏసీపీ శ్రీనివాస్‌నాయుడు వచ్చి నాయకులకు నచ్చజెప్పడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.


