ఒక్క ఓటుతో విజయం | - | Sakshi
Sakshi News home page

ఒక్క ఓటుతో విజయం

Dec 12 2025 6:09 AM | Updated on Dec 12 2025 6:09 AM

ఒక్క

ఒక్క ఓటుతో విజయం

చిట్యాల మండలంలో అత్యధిక శాతం పోలింగ్‌

న్యూస్‌రీల్‌

మర్రికుంటతండా, చిన్ననారాయణపురంలో కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులు ఒక్క ఓటుతో గెలుపొందారు.

శుక్రవారం శ్రీ 12 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

- 10లో

పోలింగ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు

మండలం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు శాతం

చండూరు 23,922 21,929 91.67

చిట్యాల 35,735 32,852 91.93

గట్టుప్పల్‌ 15,617 14,333 91.78

కనగల్‌ 35,192 31,788 90.33

కట్టంగూర్‌ 36,918 33,609 91.04

కేతేపల్లి 30,563 27,260 89.19

మర్రిగూడ 29,443 26,676 90.60

మునుగోడు 38,038 34,702 91.23

నకిరేకల్‌ 26,251 23,617 89.97

నల్లగొండ 37,852 34,205 90.37

నాంపల్లి 32,237 29,388 91.16

నార్కట్‌పల్లి 42,426 37,812 89.12

శాలిగౌరారం 40,388 36,241 89.73

తిప్పర్తి 26,425 23,904 90.46

మొత్తం 4,51,007 4,08,316 90.53

పంచాయతీ ఎన్నికల మొదటి విడతలో 90.53 శాతం పోలింగ్‌

నల్లగొండ మండలం అనంతారంలో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న యువతి

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీ మొదటి విడత పోలింగ్‌కు ఓటర్లు పోటెత్తారు. మొదటి విడత పోలింగ్‌ జరుగుతున్న నల్లగొండ, చండూరు డివిజన్ల పరిధిలో 14 మండలాల్లో 90.53 శాతం పోలింగ్‌ నమోదైంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా మొదటి రెండు గంటల్లో కాస్త మందకొడిగా సాగిన పోలింగ్‌.. 9 గంటల తర్వాత పోలింగ్‌ బూత్‌లకు ఓటర్లు పోటెత్తారు. ప్రతి రెండు గంటలకోసారి యంత్రాంగం పోలింగ్‌ వివరాలను వెల్లడించింది. చిట్యాల మండలం ఉరుమడ్ల, కేతపల్లి మండలం కొర్లపహాడ్‌లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య కొద్దిపాటి ఘర్షణ మినహా జిల్లా అంతటా పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది.

296 పంచాయతీల్లో ఎన్నికలు

నల్లగొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లోని 318 గ్రామాల్లో 22 సర్పంచ్‌లు, 375 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 296 గ్రామాలు, 2,495 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. ఈ గ్రామాల పరిధిలో 4,51,007 మంది ఓటర్లుండగా ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల వరకు 99,221 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 22.00 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆ తర్వాత 9 నుంచి 10 గంటల వరకు జనాలు ఓటింగ్‌ కోసం పోలింగ్‌ కేంద్రాల్లో బారులుదీరారు. 11 గంటల వరకు 2,55,932 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోంచుకోవడంతో 56.75 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆ తరువాత నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 3,68,143 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడంతో 81.63 శాతం పోలింగ్‌ నమోదైంది. ఒంటి గంటకు పోలింగ్‌ సమయం ముగిసినప్పటికి పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు బారులుదీరారు. పోలింగ్‌ ముగిసే సమయానికి మొత్తం 4,08,316 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 2,02,785 మంది పురుషులు (44.96 శాతం), 2,05,529 మంది మహిళలు (45.57 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 90.53 శాతం పోలింగ్‌ నమోదైంది.

పోలింగ్‌ సరళిని పరిశీలించిన

ఉన్నతాధికారులు

ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కావడంతో కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో పాటు ఎన్నికల పరిశీలకురాలు కొర్ర లక్ష్మి, డీపీఓ వెంకయ్య, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, ఆర్డీఓ అశోక్‌రెడ్డి వివిధ గ్రామాల్లో పర్యటించి పోలింగ్‌ సరళిని, మధ్యాహ్నం తర్వాత జరిగిన కౌంటింగ్‌ను పరిశీలించారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి. ఎన్నికల పరిశీలకురాలు కొర్ర లక్ష్మి కలెక్టరేట్‌లో వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఆయా గ్రామాల్లోని పోలింగ్‌ సరళిని వీక్షించి ఎప్పటికప్పుడు ఎన్నికల సిబ్బందికి సలహాలు ఇస్తూ పోలింగ్‌ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు.

మొదటి విడత జరిగిన పోలింగ్‌లో 14 మండలాల పరిధిలో అత్యధికంగా చిట్యాల మండలంలో 91.93 శాతం పోలింగ్‌ నమోదైంది. అక్కడ 35,735 మంది ఓటర్లు ఉండగా, 32,852 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక అత్యల్పంగా నార్కట్‌పల్లి మండలంలో 89.12 శాతం పోలింగ్‌ నమోదైంది. అక్కడ 42,426 మంది ఓటర్లు ఉండగా, 37,812 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పోలింగ్‌ సరళిని పరిశీలిస్తున్న

ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

ఫ పోలింగ్‌ కేంద్రాల వద్ద

బారులుదీరిన ఓటర్లు

ఫ పోలింగ్‌ సమయం ముగిసినా క్యూలో ఉన్న 8.9 శాతం మంది ఓటర్లు

ఫ రెండు గంటలకోసారి వివరాలను

వెల్లడించిన యంత్రాంగం

ఫ రెండు చోట్ల మినహా

అంతటా ప్రశాంతం

ఒక్క ఓటుతో విజయం
1
1/8

ఒక్క ఓటుతో విజయం

ఒక్క ఓటుతో విజయం
2
2/8

ఒక్క ఓటుతో విజయం

ఒక్క ఓటుతో విజయం
3
3/8

ఒక్క ఓటుతో విజయం

ఒక్క ఓటుతో విజయం
4
4/8

ఒక్క ఓటుతో విజయం

ఒక్క ఓటుతో విజయం
5
5/8

ఒక్క ఓటుతో విజయం

ఒక్క ఓటుతో విజయం
6
6/8

ఒక్క ఓటుతో విజయం

ఒక్క ఓటుతో విజయం
7
7/8

ఒక్క ఓటుతో విజయం

ఒక్క ఓటుతో విజయం
8
8/8

ఒక్క ఓటుతో విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement