నేడే తొలి విడత పంచాయతీ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

నేడే తొలి విడత పంచాయతీ ఎన్నికలు

Dec 11 2025 7:26 AM | Updated on Dec 11 2025 7:26 AM

నేడే

నేడే తొలి విడత పంచాయతీ ఎన్నికలు

నిర్భయంగా ఓటు వేయాలి

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగే నల్లగొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లో ఏకగ్రీవాలు పోగా, 296 సర్పంచ్‌ స్థానాలకు, 2,495 వార్డు సభ్యుల ఎన్నికలకు గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్‌ చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. సాయంత్రం నాలుగైదు గంటలకు విజేతలు ఎవరో తేలనుది. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో పాటు ఎన్నికల పరిశీలకురాలు కొర్ర లక్ష్మి పర్యవేక్షించారు. ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మకమైన 34 గ్రామాలతో పాటు 361 క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు.

280 వాహనాల్లో సిబ్బంది,

సామగ్రి తరలింపు

మొదటి విడత పోలింగ్‌ కోసం 14 మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్‌తోపాటు ఎన్నికల పరిశీలకురాలు బుధవారం నల్లగొండ, నార్కట్‌పల్లి, గట్టుప్పల్‌, మునుగోడు తదితర మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలకు పరిశీలించారు. ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. 280 బస్‌లు, కార్లు, ఇతర వాహనాల్లో పోలింగ్‌ సిబ్బంది తరలించారు. సిబ్బంది పోలింగ్‌ సామగ్రితో బుధవారమే గ్రామాలకు చేరుకుంది.

ఓటర్ల స్లిప్పులు పంపిణీ పూర్తి

ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఓటర్లకు ఇప్పటికే ఓటర్‌ స్లిప్పులను సిబ్బంది పంపిణీ చేశారు. అయితే పోలింగ్‌ సందర్భంగా ఓటర్లు పోలింగ్‌ స్లిప్పుతోపాటు ఓటరు గుర్తింపు కార్డు లేదా ఆధార్‌ తదితర గుర్తింపు కార్డులు వెంట తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.

సిబ్బంది కేటాయింపు

మొదటి విడత ఎన్నికలు జరిగే 318 గ్రామాల్లో 22 సర్పంచ్‌లు 375 వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 296 గ్రామాలు, 2,495 వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. పోలింగ్‌ నిర్వహణకు ఆర్‌వోలు 111 మంది, ఏఆర్వోలు 111, స్టేజ్‌–2 ఆర్‌ఓలు 350 మంది, పీవోలు 3,444, ఓపీఓలు 4,448, రూట్‌ ఆఫీసర్లు 103, మైక్రో అబ్జర్వర్లు 57 మందిని నియమించారు. 14 ఎఫ్‌ఎస్‌టీ టీమ్‌లను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ నిర్వహణకు 3,444 బ్యాలెట్‌ బాక్స్‌లు సమకూర్చారు.

పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎలాంటి తప్పిదాలకు, గొడవలకు అవకాశం లేకుండా బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎలాంటి ఒత్తిళ్లకు గురి చేసినా, ఓటర్లను ఇబ్బంది పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఓటర్లు ఎవరూ ఆందోళనకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు వేయాలి.

– ఇలా త్రిపాఠి, కలెక్టర్‌

ఎన్నికలు జరిగే గ్రామాలు, ఓటర్ల వివరాలు..

మండలం ఏకగ్రీవాలు ఎన్నికలు జరిగే పోలింగ్‌ ఓటర్లు

గ్రామాలు కేంద్రాలు

చండూరు 1 18 166 24,323

చిట్యాల 0 18 180 35,735

గట్టుప్పల్‌ 0 7 68 15,617

కనగల్‌ 2 29 262 36,892

కట్టంగూర్‌ 2 20 206 37,362

కేతేపల్లి 1 15 160 31,084

మర్రిగూడ 2 16 170 30,785

మునుగోడు 0 28 294 38,038

నకిరేకల్‌ 1 16 160 26,843

నల్లగొండ 2 29 270 39,229

నాంపల్లి 5 27 276 36,411

నార్కట్‌పల్లి 2 27 262 43,772

శాలిగౌరారం 1 23 230 40,388

తిప్పర్తి 3 23 216 27,690

మొత్తం 22 296 2,870 4,64,169

ఫ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌

ఫ రెండు గంటల నుంచి కౌంటింగ్‌, ఆ తర్వాత ఫలితాల వెల్లడి

ఫ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల నుంచి పోలింగ్‌ కేంద్రాలకు చేరిన సామగ్రి, సిబ్బంది

ఫ ఏకగ్రీవాలు పోగా.. 296 సర్పంచ్‌, 2,495 వార్డులకు ఎన్నికలు

ఫ 34 గ్రామాలు, 361 క్రిటికల్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌

నేడే తొలి విడత పంచాయతీ ఎన్నికలు 1
1/4

నేడే తొలి విడత పంచాయతీ ఎన్నికలు

నేడే తొలి విడత పంచాయతీ ఎన్నికలు 2
2/4

నేడే తొలి విడత పంచాయతీ ఎన్నికలు

నేడే తొలి విడత పంచాయతీ ఎన్నికలు 3
3/4

నేడే తొలి విడత పంచాయతీ ఎన్నికలు

నేడే తొలి విడత పంచాయతీ ఎన్నికలు 4
4/4

నేడే తొలి విడత పంచాయతీ ఎన్నికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement