హక్కుల రక్షణలో పోలీసుల పాత్ర కీలకం
ఫ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ మెంబర్ వర్రె వెంకటేశ్వర్లు
రామగిరి(నల్లగొండ): పౌరుల హక్కుల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ మెంబర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బుధవారం నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు హక్కులు–మన రోజువారీ అవసరాలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి మనిషికి పుట్టుకతోనే లభించేవి హక్కులని.. వాటిని పరిరక్షిస్తేనే సంపూర్ణ న్యాయం జరుగుతుందని అన్నారు. పోలీసు వ్యవస్థ హక్కులను కాపాడుతుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి తమ హక్కులను ఎలా కాపాడుకోవాలో నేర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ డాక్టర్ సుంకరి రాజారామ్, సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు యర్రమాద కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ మంజుల, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


