శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు
రామగిరి(నల్లగొండ): శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవవని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ హెచ్చరించారు. బుధవారం నల్లగొండ మండలంలోని అప్పాజీపేట గ్రామాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌కు సహకరించాలని కోరారు. మొదటి విడత ఎన్నికలో 2 వేల పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజల్లో భరోసా కల్పించామన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో ఉన్న 1,141 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. అత్యవసర సమయంలో డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శివరామ్‌రెడ్డి, సీఐ రాఘవరావు, ఎస్సై సైదాబాబు తదితరులు పాల్గొన్నారు.
సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
నల్లగొండ : పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. బుధవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల లోపల ఎవ్వరినీ రానివ్వకూడదని తెలిపారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు సెల్‌ఫోన్లు, ఇంక్ బాటిల్స్, హాని కలిగించే వస్తువులు తీసుకురాకుండా తనిఖీ చేయాలన్నారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ఊరేగింపు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్


