విద్యార్థులు లక్ష్య సాధనకు శ్రమించాలి
దేవరకొండ : విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్య సాధనకు నిరంతరం పట్టుదలతో శ్రమించాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన 11వ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కళాశాలలో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు కృషిచేసిన ప్రిన్సిపాల్ రవితోపాటు అధ్యాపకులను ఆయన అభినందించారు. అనంతరం 2024–25 విద్యాసంవత్సరానికి గాను వివిధ సబ్జెక్టులలో విద్యార్థులకు ఆయన బంగారు పథకాలు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి, అధ్యాపకులు కోటయ్య, లింగమయ్య, లింగారెడ్డి, పృథు, ధనుంజయ, శాంసన్, గాజుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


