ఆరోగ్య బీమా.. జీవితానికి ధీమా
నల్లగొండ: ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరి జీవితానికి ధీమా ఇస్తుందని నల్లగొండ అదనపు ఎస్పీ రమేష్ అన్నారు. మంగళవారం నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో హోం గార్డులకు, సిబ్బందికి ఆరోగ్య, ప్రమాద బీమా సౌకర్యాలపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సెస్ బ్యాంకుల్లో ఖాతా ఉన్న సిబ్బంది ప్రతి సంవత్సరం రూ.11,650 ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లిస్తే కుటుంబంలోని నలుగురు (కుటుంబ యజమాని, భార్య, ఇద్దరు పిల్లలకు) రూ.33 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుందని తెలిపారు. ఈ బ్యాంకుల్లో శాలరీ అకౌంట్ ఉండి డెబిట్ కార్డు ఉన్న వ్యక్తులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.30 లక్షల ప్రమాద బీమా లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, హోం గార్డ్ ఆర్‌ఐ శ్రీను, హెచ్‌డీఎఫ్‌సీ మేనేజర్ సత్యనారాయణ, యాక్సెస్ బ్యాంక్ మేనేజర్ రవీందర్‌రెడ్డి, ఇన్సూరెన్స్ అధికారులు, హోం గార్డ్‌లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


