
దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : వెటర్నరీ, యానిమల్ హస్పెన్డరీ, ఫిషరిస్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ (3), ఆఫీస్ సబార్డినేట్లు (38) ఖాళీ భర్తీ కోసం అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలు ఈ నెల 24న సాయంత్రం 4 గంటల్లోగా జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలను కలెక్టర్ డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు.
సురక్ష బీమా
యోజనలో చేర్పించాలి
నల్లగొండ : రోజువారీ పనులు చేసుకునే వారందరితో ప్రధామంత్రి సురక్ష బీమా యోజనలో చేర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం నల్లగొండలోని తన ఛాంబర్‌లో మున్సిపల్ కమిషనర్లతో ఆమె సమావేశమై మాట్లాడారు. పనులు చేసేవారికి బ్యాంకులు రూ.2 లక్షల వరకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయని తెలిపారు. సంవత్సరానికి రూ.20 చెల్లించిన వారు మరణిస్తే రూ.2 లక్షలు, అంగవైకల్యం కలిగితే రూ.లక్ష బీమా వస్తుందని తెలిపారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్లు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.