
స్వీట్ షాపుల్లో తనిఖీలు
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని పలు స్వీట్ షాపులు, తయారీ కేంద్రాలు, రిటైల్ యూనిట్లలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. 12 స్వీట్ తయారీ కేంద్రాలు, 7 స్వీట్ షాపుల్లో తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ సేకరించారు. వంట గదుల్లో అపరిశుభ్రత పసుపు, కారం, ఇతర మసాలాల్లో నాణ్యత లేకపోవడాన్ని గుర్తించారు. నిబంధనలు పాటించని తయారీ కేంద్రాల యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు ఫుడ్ సేఫ్టీ ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి జ్యోతిర్మయి తెలిపారు. కార్యక్రమంలో ఫుడ్‌సేఫ్టీ సిబ్బంది పాల్గొన్నారు.