
రేపు నల్లగొండలో జాబ్‌మేళా
నల్లగొండ టూటౌన్: జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు పలు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 17న ఉదయం 10.30 గంటలకు నల్లగొండలోని ఐటీఐ క్యాంపస్‌లో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ (అన్ని ట్రేడ్‌ల)లో ఉత్తీర్ణత పొందిన 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గలవారు అర్హులని పేర్కొన్నారు. జాబ్‌మేళాకు వచ్చే వారు నేరుగా బయోడేటా, ఒరిజినల్ సర్టిపికెట్లతో ఉపాధి కల్పన కార్యాలయ ఆవరణలోని ఐటీఐ క్యాంపస్‌కు రావాలని కోరారు.
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
మర్రిగూడ : స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి అన్నారు. బుధవారం మర్రిగూడ మండల కేంద్రంలో మర్రిగూడ, నాంపల్లి మండలాల బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో గంగిడి మనోహర్‌రెడ్డి, జక్కలి రాజు, రాజేందర్, నరసింహ, గ్యార గోపాల్, పందుల రాములు, కిశోర్ పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ప్రేమ్‌చంద్ మంగళవారం హుజూర్‌నగర్‌లో జరిగిన ఉమ్మడి జిల్లా అండర్–14 కబడ్డీ పోటీల్లో ప్రతిభచాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం ధర్మానాయక్ తెలిపారు. బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థి ప్రేమ్‌చంద్‌ను అభినందించి మాట్లాడారు. ఈనెల 16, 17, 18 తేదీల్లో హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటాడని తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయురాలు వినోద, ఉపాధ్యాయులు కుర్ర కృష్ణకాంత్‌నాయక్, ఉపేందర్, ముంతాజ్‌బేగం, తావుర్యా, సంతోష్, అనిత, జ్యోతి, ధనలక్ష్మి, అశ్విని, స్పందన, బేబిరాణి, వినోద, కాంతయ్య, జానయ్య, జంగయ్య, స్వామి, లక్ష్మయ్య, మీనా, భవాని, రేణుక పాల్గొన్నారు.