
నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి
కనగల్: కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి ప్రభుత్వం ప్రకటించిన ఏ గ్రేడ్‌కు క్వింటాకు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు పొందాలని డీఆర్‌డీఓ ఎర్రబెల్లి శేఖర్‌రెడ్డి సూచించారు. బుధవారం కనగల్ మండలం తేలకంటిగూడెం, ఎస్.లింగోటం, చెట్లచెన్నారం, తిమ్మన్నగూడెం, చర్లగౌరారం గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సన్న రకానికి ప్రభుత్వం అదనంగా రూ.500 బోనస్ అందిస్తుందన్నారు. ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దర్వేశిపురం రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ చైర్మన్ చీదేటి వెంకట్‌రెడ్డి, ఆర్టీఏ మెంబర్ కూసుకుంట్ల రాజారెడ్డి, ఏపీఎం దాసరి మైసేశ్వర్‌రావు, బోగరి రాంబాబు, పోషమల్ల లింగయ్య, విజయ, ప్రభాకర్, ఇద్దయ్య, చీదేటి సంతోష్‌రెడ్డి, నిర్వాహకులు పాల్గొన్నారు.
ఫ డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి