
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
నల్లగొండ టూటౌన్: స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు సాధించే అవకాశం ఉన్నందున విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి ఉజ్వల భవిష్యత్‌ను అందుకోవాలని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) జిల్లా కార్యదర్శి డి.విమల అన్నారు. జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడల ఎంపిక పోటీల్లో భాగంగా బుధవారం నల్లగొండలోని మేకల అభినవ్ అవుట్‌డోర్ స్టేడియంలో తలపెట్టిన అండర్–14, 17 బాలబాలికల ఖోఖో పోటీలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు శారీర దారుఢ్యానికి ఎంతో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్.రాజశేఖర్‌రెడ్డి, వీసం రాజు, జయ, శోభారాణి, సత్యనారాయణ, శ్రీకాంత్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, యుగేంధర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, గఫార్, ఇర్ఫాన్, బ్రహ్మయ్య, శ్రీనివాసరావు తదితరలు పాల్గొన్నారు.