
ప్రజాస్వామ్య పద్ధతిలో డీసీసీ అధ్యక్షుడి ఎంపిక
దేవరకొండ: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆలోచన మేరకు ప్రజాస్వామ్యపద్ధతిలో డీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నట్లు ఏఐసీసీ కార్యదర్శి, డీసీసీ ఎన్నికల ఇన్‌చార్జి విశ్వరాజన్ మహంతి తెలిపారు. డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియలో భాగంగా బుధవారం దేవరకొండ పట్టణంలో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విశ్వరాజన్ మహంతి మాట్లాడుతూ బూత్‌స్థాయి నుంచి పార్టీని బలో పేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయి కార్యకర్తలను నేరుగా కలిసి పార్టీ బలోపేతాకి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నట్లు తెలిపారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు అహర్నిశలు పనిచేయాలని అనంతరం ఎమ్మెల్యే బాలునాయక్, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీ పట్టం కడుతుందని పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక తర్వాత గ్రామ, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలంతా కృషిచేయాలన్నారు. అనంతరం దేవరకొండ మండలం కొమ్మేపల్లిలో 67, 68 బూత్‌స్థాయి కార్యకర్తలతో వారు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమునామాధవరెడ్డి, నాయకులు ఎంఏ సిరాజ్‌ఖాన్, దూదిపాళ్ల వేణుధర్‌రెడ్డి, ఆలంపల్లి నర్సింహ, మారుపాకుల సురేష్‌గౌడ్, నల్లగాసు జాన్‌యాదవ్, యూనూస్, శిరందాసు కృష్ణయ్య, వేమన్‌రెడ్డి, కాసర్ల వెంకటేశ్వర్లు, పస్నూరి యేగేందర్‌రెడ్డి, కొర్ర రాంసింగ్, కిన్నెర హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఏఐసీసీ కార్యదర్శి విశ్వరాజన్ మహంతి