
బీసీల బంద్‌ను జయప్రదం చేయాలి
నల్లగొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చినందుకు నిరసనగా ఈ నెల 18న నిర్వహించే బీసీల బంద్‌లో అన్నివర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు గండిచెర్వు వెంకన్నగౌడ్ పిలుపునిచ్చారు. నల్లగొండలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో బుధవారం బంద్ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలన్నారు. బంద్‌కు విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు ఐతగోని జనార్దన్‌గౌడ్, తండు సైదులుగౌడ్, వైద్యుల సత్యనారాయణ, పందుల సైదులుగౌడ్, భోనగిరి దేవేందర్, కట్టెకొల్లు దీపేందర్, బకరం శ్రీనివాస్, దేవయ్య, కర్నాటి యాదగిరి, చీర పంకజ్ యాదవ్, పాల్వాయి రవి, కట్టెల శివ, కొంపల్లి రామన్నగౌడ్, చెనగోని నరేష్, వంశీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.