
ఇంటర్ ఫలితాల పెంపుపై దృష్టి పెట్టాలి
నల్లగొండ : ఇంటర్మీడియట్ ఫలితాలను పెంచడంపై దృష్టి సారించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మోడల్ స్కూల్స్, కేజీబీవీ, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, మోడల్ పాఠశాలల ప్రిన్సిపాల్స్‌తో సమీక్షించారు. ఇంటర్ కళాశాలల్లో ఫలితాలు, ఫేస్ రికగ్నిషన్ విధానం తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆమె మట్లాడుతూ ఇంటర్ కళాశాలల్లో నూటికి నూరు శాతం పేస్ రికగ్నిషన్ సిస్టం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల హాజరు శాతం, అభ్యసన సామర్థ్యం పెంచాలన్నారు. సమావేశంలో డీఐఈఓ దస్రూనాయక్, డీఈఓ భిక్షపతి, ఆర్‌సీఓ స్వప్న, బలరాం తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులను ఎంపిక చేయాలి
రామగిరి(నల్లగొండ): పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించేందుకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. నల్లగొండ మండలంలోని దోమలపల్లిలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను బుధవారం ఆమె పరిశీలించారు. దోమలపల్లికి 70 ఇళ్లు మంజూరు కాగా.. 56 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గిరిధర్ వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్‌రెడ్డి, తహసీల్దార్ పరశురామ్ పాల్గొన్నారు.
17ఎన్‌ఎల్‌సి304 :
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి