
అక్టోబర్ 2 వరకు ‘స్వచ్ఛతా హీ సేవ’
నల్లగొండ : ప్రతి గ్రామ పంచాయతీలో అక్టోబరు 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు చేపట్టాలని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం డీఆర్‌డీఏ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని గ్రామీణ పంచాయతీ అధికారులకు సూచించారు. ప్రతి ఉద్యోగి ఇంటి పరిసరాలతో పాటు కార్యాలయ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్‌డీఓ శ్రవణ్‌కుమార్, వేణుగోపాలరావు, వెంకన్న, మెయినుద్దీన్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మూసీకి కొనసాగుతున్న వరద
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరదనీటి రాక కొనసాగుతోంది. ఎగువ నుంచి 3,523 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా.. బుధవారం అధికారులు ప్రాజెక్టు రెండు క్రస్ట్‌గేట్లను పైకెత్తి 2,625 క్యూసెక్కుల నీటిని దిగవకు వదులుతున్నారు. కాల్వలకు 552 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సీపేజీ ఆవిరి రూపంలో 60 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. మూసీ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.09 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
ఎంజీయూలో నూతన అధిపతుల నియామకం
నల్లగొండ టూటౌన్: నల్లగొండ పట్టణ సమీపంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బుధవారం వివిధ విభాగాలకు నూతన అధిపతులను నియమిస్తూ రిజిస్ట్రార్ అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. రసాయన శాస్త్ర విభాగానికి ఎం. జ్యోతి, గణిత శాస్త్ర విభాగానికి జి. ఉపేందర్‌రెడ్డి, భౌతిక శాస్త్ర విభాగానికి శాంతకుమారి, రసాయన శాస్త్ర విభాగం బీఓఎస్‌గా ఆర్. రూప నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారిని వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అభినందించారు.