
బీఆర్‌ఎస్.. జాతీయ సమైక్యతా దినోత్సవం
నల్లగొండ టూటౌన్: బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం బీఆర్‌ఎస్ నాయకులు జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ నల్లగొండలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బండా నరేందర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కంచర్ల కృష్ణారెడ్డి, కటికం సత్తయ్యగౌడ్, చీర పంకజ్‌యాదవ్, మాలే శరణ్యారెడ్డి, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.