
ఐఈసీ జనరల్ మీటింగ్‌కు ఆహ్వానం
కనగల్ : ఢిల్లీలో ఈ నెల 8 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న 89వ ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ (ఐఈసీ) జనరల్ సమావేశానికి కనగల్ మండలంలోని మోడల్ పాఠశాల ఫిజిక్స్ ఉపాధ్యాయుడు గాజుల శ్రీనివాస్‌గౌడ్ ఎంపికయ్యారు. ఈ యాన పాఠశాలలో బీఐఎస్ స్టాండర్డ్ క్లబ్ స్థాపించి వస్తువుల నాణ్యత, ప్రమాణాల లోపాలపై ఎక్కడ ఫిర్యాదు చేయాలి, వస్తువుల నాణ్యతను ఎలా పరిశీలించాలి అనే విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. కాగా, ఎలక్ట్రో టెక్నికల్ స్టాండర్డ్స్ సమావేశానికి తెలంగాణ నుంచి 9 మంది టీచర్లను ఎంపిక చేయగా వారిలో శ్రీనివాస్‌గౌడ్ ఒకరు. తన ఎంపికపై బీఐఎస్ హైదరాబాద్ బ్రాంచి అధికారులకు శ్రీనివాస్‌గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.
నేడు నల్లగొండకు బృందాకరత్ రాక
నల్లగొండ టౌన్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం నల్లగొండకు సీపీఎం పొలిట్‌బ్యూరో మాజీ సభ్యురాలు బృందా కరత్ వస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా నల్లగొండలోని పెద్ద గడియారం సెంటర్ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, పాలడుగు నాగార్జున, నారి ఐలయ్య, చిన్నపాక లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బోధనలో వ్యూహాలను మార్చుకోవాలి
నకిరేకల్ : విద్యా బోధనలో ఉపాధ్యాయులు వ్యూహాలను మార్చుకుని నాణ్యమైన విద్యను అందించాలని విద్యాశాఖ రాష్ట్ర ప్రాజెక్టు అసిస్టెంట్ డెరెక్టర్ రాధారెడ్డి సూచించారు. అకడమిక్ మానటరింగ్‌లో భాగంగా నకిరేకల్‌లోని భవిత విద్యా కేంద్రాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. తల్లిదండ్రులకు అహగాన కల్పించారు. అనంతరం స్దానిక జడ్పీ హైస్కూల్‌ను సందర్శించిన 10వ తరగతిగదిలో సోషల్ స్టడీస్ పాఠ్యంశాల బోధనను పరిశీంచారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలని కోరారు. ఆమె వెంట ఎంఈఓ మేక నాగయ్య, ఐఆర్‌టీ శ్రీనివాస్ ఉన్నారు.
అధికారికంగా నిర్వహించాలి
నల్లగొండ టూటౌన్ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం దురదృష్టకరమని విమర్శించారు.
మూసీకి
కొనసాగుతున్న వరద
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరదనీటి రాక కొనసాగుతోంది. ఎగువ నుంచి 4,732 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా.. మంగళవారం అధికారులు ప్రాజెక్టు రెండు క్రస్టు గేట్లను పైకెత్తి 5,450 క్యూసెక్కుల నీటిని దిగవకు వదులుతున్నారు. కాల్వలకు 549 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మూసీ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.02 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

ఐఈసీ జనరల్ మీటింగ్‌కు ఆహ్వానం

ఐఈసీ జనరల్ మీటింగ్‌కు ఆహ్వానం

ఐఈసీ జనరల్ మీటింగ్‌కు ఆహ్వానం