
పల్లెల్లో పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం తగదు
గట్టుప్పల్ : పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులకు నిర్లక్ష్యం తగదని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య అన్నారు. గట్టుప్పల్ మండల పరిధిలోని వెల్మకన్నె, అంతంపేట గ్రామ పంచాయతీలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనఖీ చేశారు. ఆయా చోట్ల రికార్డుల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, డంపింగ్ యార్డుల నిర్వహణపై నిర్లక్ష్యం వహించడంతో పంచాయతీ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గ్రామాల కార్యదర్శులకు వెంటనే షోకాజ్ నోటీసులు అందజేయాలని ఎంపీఓ సునీతకు ఆదేశాలు జారీ చేశారు.