
ఎరువులు కృత్రిమ కొరత సృష్టించొద్దు
చిట్యాల : ఫర్టిలైజర్ దుకాణదారులు ఎరువులు, విత్తనాలను అధిక రేట్లకు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా వెంటనే షాపుల లైసెన్స్ రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్ హెచ్చరించారు. చిట్యాల పట్టణంలోని మన గ్రోమోర్ సెంటర్, ఆగ్రో రైతు సేవా కేంద్రాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఆయా చోట్ల ఎరువుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువుల అమ్మకాల వివరాలను ఎప్పటికప్పుడు ఈపాస్ మిషన్‌లో నమోదు చేయాలని సూచించారు. స్టాక్ వివరాలను షాపులలో బోర్డుపై ప్రదర్శించాలన్నారు. అనంతరం మండలంలోని ఉరుమడ్ల జెడ్పీహెచ్‌ఎస్, మండల పరిషత్ పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. పాఠశాలలకు సరఫరా అవుతున్న బియ్యం, కూరగాయాలు, వండిన భోజనాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంఈఓ పి.గిరిబాబు ఉన్నారు.