
నేరాల నియంత్రణకు కృషిచేయాలి
తిరుమలగిరి(నాగార్జునసాగర్) : శాంతి భద్రతలు, నేరాల నియంత్రణకు పోలీసులు కృషి చేయాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ కోరారు. మంగళవారం తిరుమలగిరి సాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన రికార్డులు, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్లు, కేస్ డైరీలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా నిబద్దతతో పనిచేయాలని సూచించారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తించి, పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెంపొందించేలా వ్యవహరించాలన్నారు. రిసెప్షన్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉమెన్ కానిస్టేబుల్ ఇంద్రజను ప్రత్యేకంగా అభినందించి రివార్డు అందజేశారు. అంతకుముందు పోలీసులు ఎస్పీకి గౌరవ వందనం చేశారు. ఆయన వెంట మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు, సాగర్ సీఐ శ్రీనునాయక్, ఎస్‌ఐ వీరశేఖర్, సిబ్బంది ఉన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్