
అంగన్‌వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దు
నల్లగొండ టౌన్ : నూతన విద్యావిధానం అమలులో భాగంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రవేశపెట్టి అంగన్‌వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి అన్నారు. అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సీటీయూ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండలోని గడియారం సెంటర్‌లోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రీప్రైమరీ విద్యను అంగన్‌వాడీలకు అప్పగించాలన్నారు. అంగన్‌వాడీ టీచర్లకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 25న చలో సెక్రటరీయేట్ కార్యక్రమం చేపట్టామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం, సహాయ కార్యదర్శి దండెపల్లి సత్తయ్య, యూనియన్ జిల్లా అధ్యక్షుడు పొడిశెట్టి నాగమణి, కార్యదర్శి బొందు పార్వతి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె.విజయలక్ష్మి, రమ, మణెమ్మ, సునంద, సైదమ్మ, ఫాతిమా, సరిత, స్వప్న, స్వరాజ్యం, సముద్రమ్మ, సుభాషిణి, ఎల్లమ్మ, జానమ్మ, సంధ్య, మల్లు గౌతంరెడ్డి, అవుట రవీందర్, రాజు తదితరలు పాల్గొన్నారు.