
సమతుల ఆహారం.. సంపూర్ణ ఆరోగ్యం!
అంగన్‌వాడీల వివరాలు..
పోషణ స్థాయిని పెంపొందిస్తాం
మిర్యాలగూడ టౌన్ : మాత శిశు మరణాలను నివారించడంతో పాటు ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ప్రభుత్వం శ్రీపోషణ మాసంశ్రీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తూ.. పోషణ స్థాయిని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది.. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పోషణ మాసోత్సవాలు అక్టోబర్ 16వ తేదీని ముగుస్తాయి. ఈ పోషణ మాసంలో గర్భిణులు, బాలింతలతో సమావేశాలను ఏర్పాటు చేసి పౌష్టికాహారంపై అవగాహన కల్పించనున్నారు. స్వయంగా అంగన్‌వాడీలు తయారు చేసిన పౌష్టికాహారాన్ని వారికి అందించనున్నారు.
పౌష్టికాహారం పంపిణీ
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఇప్పటికే గర్భిణులు, బాలింతలు, మూడేళ్లలోపు పిల్లలకుపాలు, గుడ్లు, బాలామృతంతో పాటు పలు రకాల పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అదే విధంగా పిల్లల ఎత్తు, బరువు తీసుకుని వారికి అవసరమైన వైద్య పరీక్షలను చేయిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే ఐదేళ్లలోపు పిల్లలకు ప్రాథమిక విద్యతో పాటు గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సంపూర్ణ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. నెల 30 గుడ్లు, రోజూ ఒకొక్కరికి 200 మిల్లీలీటర్ల పాలను ఇస్తూ మాతాశిశు ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు.
పోషణ మాసం కార్యక్రమాలు ఇలా
● స్థానిక ఉత్పత్తులు, బొమ్మలు, పౌష్టికాహారం పదార్థాల వినియోగంపై అవగాహన.
● గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల పోషణపై సలహాలు, సూచనలు ఇస్తారు. అనుబంధ ఆహారాల తయారీ, వంటకాల పోటీలు.
● కిశోర బాలికలకు వైద్య పరీక్షలతో పాటు పిల్లల బరువు, ఎత్తు కొలతలను తీయడం, ఆహారంలో చెక్కర, నూనె వినియోగం తగ్గించడంపై అవగాహన.
● చిన్నారుల తండ్రులు, సంరక్షులకు అనుబంధ ఆహారంపై పోటీలు, అదే విధంగా తండ్రులతో పొషకాహారం ప్రతిజ్ఞ. అంగన్‌వాడీ కేంద్రాల్లో కథలు చెప్పడం, బొమ్మల ప్రదర్శన, వాటి ద్వారా ఈసీసీఈ సెషన్, 0– 3 ఏళ్ల పిల్లల ఆరంభ అభివృద్ధి, ప్రేరణ కోసం దృష్టి సారించాల్సిన కార్యక్రమాలు, తల్లిదండ్రులతో చేయించడం.
● పోషణ లోపం ఉన్న పిల్లలకు ఆరోగ్య పరీక్షలు, ఆకలి పరీక్షలు, గ్రోత్ మానటరింగ్, పిల్లల బరువు, ఎత్తును కొలవడం.
● బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు తాపడం, పిల్ల్లల అనుబంధ ఆహారంపై అవగాహన.
● ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవన శైలిపై అవగాహన.
● స్థానిక వంటకాలు, చిరు ధాన్యాలు, కూరగాయలు, స్వదేశీ బొమ్మల తయారీ.
● పోషణ మిషన్ వంద రోజుల ప్రచారం, గ్రామ, వార్డు సభలు, పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ, గృహ సందర్శన, అంగన్‌వాడీ కేంద్రాల్లో శుభ్రత తదితర అంశాలపై అవగాహన కల్పించడం.
అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులు
పోషక విలువలతో కూడిన ఆహారం
ఐసీడీఎస్ ప్రాజెక్టులు 09
అంగన్‌వాడీ కేంద్రాలు 2,093
0నెలల నుంచి 6 ఏళ్లలోపు
పిల్లలు 75,612
గర్భిణులు 8,659
బాలింతలు 6,360
ఫ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు
‘పోషణ మాసం’
ఫ అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహణ
ఫ పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తూ పోషణ స్థాయిని పెంచడమే లక్ష్యం
గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నాం. గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకుంటే మాతా శిశు మరణాలను తగ్గించవచ్చు. పోషక విలువలు కలిగిన ఆహారాన్ని క్రమ పద్ధతిలో తీసుకుంటే మంచిది. అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్న ప్రాసన, జన్మదిన వేడుకలను కూడా నిర్వహించనున్నాం. పోషణ స్థాయిని పెంపొందించడమే ప్రధాన లక్ష్యం.
– కృష్ణవేణి, జిల్లా సంక్షేమ అధికారిణి,
నల్లగొండ

సమతుల ఆహారం.. సంపూర్ణ ఆరోగ్యం!

సమతుల ఆహారం.. సంపూర్ణ ఆరోగ్యం!