శాలిగౌరారం : మండలంలోని వల్లాల గ్రామంలో నాటి నిజాం నిరంకుశత్వానికి బలైన అమరవీరుల జ్ఞాపకార్థ పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు సొంత ఖర్చులు రూ.10 లక్షలతో నిర్మించిన అమరవీరుల స్మారక స్థూపాన్ని ఈనెల 12వ తేదీన ఆవిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే మందులు సామేలు, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ తెలిపారు. సోమవారం వారు వల్లాలకు వచ్చి సభావేదిక ఏర్పాటు, సౌకర్యాల కల్పన తదితర అంశాలపై కాంగ్రెస్‌పార్టీ మండల నాయకత్వానికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరవీరుల స్థూపం ఆవిష్కరణకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్, రాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతితులుగా హాజరుకానున్నారని తెలిపారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ తాళ్లూరి మురళి, వైస్‌చైర్మన్ నరిగె నర్సింహ్మ, బొల్లికొండ గణేశ్, తహసీల్దార్ జమీరుద్దీన్, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, షేక్ ఇంతియాజ్, వెంకటేశ్వర్లు, యాదగిరి, అంజయ్య పాల్గొన్నారు.