
సేవాదృక్పథం.. ఆయన సొంతం
అర్వపల్లి: వృత్తి పట్ల అంకితభావం, సేవాదృక్పథంతో పనిచేస్తూ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహాడ్ జెడ్పీహెచ్‌ఎస్ ఫిజికల్ సైన్స్ టీచర్ దండుగుల యల్లయ్య. 1998 డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా ఎంపికై న ఆయన ఎంఎన్‌ఓగా, సెక్టోరియల్ అధికారిగా, రిసోర్స్ పర్సన్‌గా వివిధ పదవులను సమర్థంగా నిర్వర్తించారు. గతంలో కాసర్లపహాడ్ జెడ్పీహెచ్‌ఎస్‌లో కేవలం 31మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు 60మంది వచ్చేలా కృషిచేశారు. బడికి సక్రమంగా రాని పిల్లల ఇళ్లకు వెళ్లి తన బైక్‌పై తీసుక వస్తుంటారు. ఈ పాఠశాల చెరువు సమీపంలో ఉండటంతో వర్షాలు పడినప్పుడు మునుగుతుంది. ప్రజాప్రతినిధుల సహకారంతో 200 ట్రాక్టర్ల మట్టిని తోలించి ఇబ్బందులను తొలగించారు. దాతల సహకారంతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయించారు. పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా విద్యాబోధన చేస్తున్నారు.