
గ్రామాధికారులొస్తున్నారు!
5 బస్సుల్లో నేడు హైదరాబాద్‌కు..
నల్లగొండ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామపాలన అధికారులు వచ్చేస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2022 ఆగస్టు 1న వీఆర్‌ఓ, ఆగస్టు 10న వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసి ఆ ఉద్యోగులను ఇతర శాఖలకు బదలాయించిన విషయం తెలిసిందే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని రద్దు చేయడంతోపాటు గతంలోని వీఆర్‌ఏ, వీఆర్‌ఓలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు వారి నుంచి దరఖాస్తులు తీసుకోవడంతోపాటు వారికి పరీక్షలు నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారిని ఎంపిక చేశారు. వీరిని గ్రామ పాలన అధికారులుగా పిలవనున్నారు. వీరికి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో నియామకపత్రాలు అందజేయనున్నారు.
జిల్లా నుంచి 276 మంది..
జిల్లా నుంచి గ్రామ పాలనాధికారులుగా 276 మంది ఎంపికయ్యారు. రెండు విడతలుగా రెవెన్యూ శాఖ నుంచి ఇతర శాఖలకు వెళ్లిన వారిని తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది. పరీక్ష రాసిన వారిలో ఉత్తీర్ణులైన 276 మందిని ఎంపిక చేశారు.
క్లస్టర్‌కు ఒకరి చొప్పున...
రెవెన్యూ పాలన పరంగా రెండు, మూడు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. జిల్లాలో 275 క్లస్టర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఎంపికై న 276 మంది జీపీఓలు ఆయా క్లస్టర్లలో నియామకం కానున్నారు.
తీరనున్న ఇబ్బందులు..
ఇతర శాఖల్లోకి బదలాయించిన రెవెన్యూ ఉద్యోగులను ప్రస్తుతం తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకుంటుండడంతో ఆ శాఖలో ఇబ్బందులు తొలగనున్నాయి. గ్రామ స్థాయిలో వీఆర్‌ఏ, వీఆర్‌ఓలు లేక ఆర్‌ఐలపైన భారం పడేది. ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించిన సందర్భంలో, ఇతర సర్టిఫికెట్ల జారీ, విచారణ విషయంలోనూ ఇబ్బందుల ఎదురయ్యాయి. ప్రస్తుతం గ్రామాల్లో ప్రభుత్వం గ్రామ పాలన అధికారులను నియమిస్తుండడంతో ఇబ్బందులు తొలగనున్నాయి.
గ్రామ పాలన అఽధికారులు(జీపీఓలు)గా నియామకమైన 276 మందిని శుక్రవారం హైదరాబాద్‌కు తీసుకువెళ్లేందుకు అధికారులు ఐదు బస్సులు ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రం నంచి మూడు బస్సులు, దేవరకొండ, మిర్యాలగూడ నుంచి ఒక్కో బస్సు చొప్పున మొత్తం ఐదు బస్సుల్లో జీపీఓలను అధికారులు హైదరాబాద్‌కు తీసుకు వెళ్లేందుకు అన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందించనున్నారు. అనంతరం వారికి కలెక్టర్ కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. ఆ ఉత్తర్హుల ఆధారంగా కేటాయించిన స్థానాల్లో వారు విధుల్లో చేరనున్నారు.
జిల్లాలో 276 మంది జీపీఓల నియామకం
ఫ నేడు హైదరాబాద్‌లో సీఎం చేతులమీదుగా నియామకపత్రాల పంపిణీ
ఫ రెవెన్యూ శాఖలో తొలగనున్న ఇబ్బందులు