
క్రీడా నైపుణ్యాల వెలికితీత
బొమ్మలరామారం: బొమ్మలరామారం మండలం మర్యాల జెడ్పీ హైస్కూల్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు పగిడిపల్లి నిర్మల జ్యోతి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. విద్యార్థులకు వినూత్న రీతిలో బోధన అందించి ఉత్తమ ఫలితాలు సాధించడంతో ఎంత కృషి చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికితీసి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. ఈ పాఠశాల నుంచి ఇప్పటికే పదుల సంఖ్యలో విద్యార్థులు వివిధ క్రీడల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దారు.