
పొడిగింపునకు నో!
27 సంఘాల పదవీకాలం
రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ
ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
రామగిరి(నల్లగొండ): వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. గురువారం నల్లగొండలోని దొడ్డి కొమురయ్య భవన్‌లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాలను 10 నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ పనులు తిరిగి ప్రారంభించాలన్నారు. రైతులకు నష్టపరిహారం కింద నిధులు విడుదల చేయాలన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సుధాకర్ రెడ్డి, ఐలయ్య, మల్లేశం, శ్రీశైలం, నాగార్జున, కందాల ప్రమీల పాల్గొన్నారు.
సహకార సంఘాల పాలకవర్గం పదవీకాలం ఫిబ్రవరి 22, 2025లో ముగిసింది. ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించకుండా ఆరునెలల పాటు పర్సన్‌న్ ఇంచార్జ్‌లుగా పాలక వర్గాలను కొనసాగించింది. ఆగస్టు 14తో ఆరు నెలల పదవీకాలం ముగిసింది. మరోసారి పాలక వర్గాలను ప్రభుత్వం పొడిగించింది. అయితే ఆరోపణలున్నా సొసైటీల పాలకవర్గాలను పక్కన బెట్టాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ కొంతమేరకు ఆలస్యం అయ్యింది. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 99 సొసైటీల పాలక వర్గాలను పొడిగిస్తూ సహకార అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సంఘాల పరిపాలన, ఆర్థిక లావాదేవీలపై సహకార శాఖ అధికారుల పర్యవేక్షణ ఉండనుంది.
సాక్షి యాదాద్రి : ఉమ్మడి జిల్లాలో 26 సహకార సంఘాల పాలకవర్గాల పొడిగింపు నిలిచిపోయింది.ఆయా సొసైటీల్లో నిధులు దుర్వినియోగం అయినట్లు తేలడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. యాదాద్రి భువనగిరిలో 21 ప్రాథమిక సహకార సంఘాలు ఉండగా.. ఇందలో చందుపట్ల, వలిగొండ, చౌటుప్పల్, జూలురు పాలకవర్గాలపై ఆరోపణలున్నాయి. అదే విధంగా సూర్యాపేట జిల్లాలో 43 సొసైటీలు ఉండగా నాలుగు సంఘాలపై, నల్లగొండలో 43 సొసైటీలకు గాను 19 సంఘాలపై ఆర్థికపరమైన ఆరోపణలున్నాయి.
నిబంధనలు తుంగలో తొక్కి..
సహకార సంఘాల బైలాను కాలదన్ని నిబంధనలను విరుద్ధంగా నిధులు ఖర్చు చేయడం, దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. సహకార సంఘాల సొసైటీ అధ్యక్షులు, పాలకవర్గాల సభ్యులు సహకారం చట్టానికి విరుద్ధంగా తమ పేరున తీర్మానాలు చేసుకుని తప్పుడు బిల్లులతో లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి. విచారణ జరిపిన సహకార శాఖ అధికారులు.. రాష్ట్ర శాఖకు పంపిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు.
ఫ సహకార సంఘాల్లో అవినీతి ఆరోపణలు
ఫ చట్ట విరుద్ధంగా తీర్మానాలు
ఫ తప్పుడు బిల్లులు సృష్టించి రూ.లక్షలు స్వాహా
ఫ 27 సొసైటీల పాలకవర్గాల పదవీకాలం పొడిగింపు నిలిపివేత
ఫ సహకార శాఖ ఉత్తర్వులు

పొడిగింపునకు నో!