
ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
నల్లగొండ టౌన్ : విద్యార్థులకు పెండింగ్ పీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్ డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండలో భారీ ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాయన్నారు. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా వేధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోతే ఎమ్మెల్యేలు, మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కుర్ర సైదానాయక్, కుంచం కావ్య, బుడిగ వెంకటేశ్, కోరె రమేష్, రవీందర్, రవి, కిరణ్, స్పందన, జగన్‌నాయక్, జగదీష్, రాములు, వీరన్ననాయక్, నవదీప్, రాకేష్, రమేష్, హరికృష్ణ, ప్రణీత్, కళ్యాణి, తులసి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.