
ఆరుబయటే.. ఆస్పత్రి వ్యర్థాలు!
గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025
నల్లగొండ టౌన్ : నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వ్యర్థాలు ఆరుబయటే దర్శనమిస్తున్నాయి. ఆస్పత్రిలోని బయోవేస్ట్ (ఆస్పత్రి వ్యర్థాలు) శానిటేషన్ సిబ్బంది ఇష్టానుసారంగా పడేస్తున్నారు. వాటిని నిత్యం తరలించాల్సిన కాంట్రాక్టర్ పట్టించుకోని కారణంగా ఆస్పత్రి ఆవరణలో పేరుకుపోతున్నాయి. వాటిని పాడి గేదెలు, మేకలు, పందులు, కుక్కల తింటున్నాయి. అందులో రకరకాల కాలం చెల్లిన మందులు, సిరంజీలు, కాటన్, ఇతర వ్యర్థాఽలు ఉండడం వల్ల వాటని తిని జీవాలు చనిపోయే ప్రమాదం ఉంది.
ప్రమాదకర వ్యర్థాలు..
ఆస్పత్రి వ్యర్థాలు చాలా ప్రమాదకరమైనవి. అందులో సర్జికల్ వేస్టేజీ, సిరంజీలు, గ్లౌజ్‌లు, ఇతర ఇంజెక్షన్లు, బాటిళ్లు, మాతాశిశు ఆరోగ్య కేంద్రంలోని కాన్పుల వార్టులోని వ్యర్థాలు ఉంటాయి. వాటిని రోజూ సేకరించి ఎంపిక చేసిన ప్రాంతంలో పడేయాలి. అక్కడి నుంచి ఆస్పత్రి వ్యర్థాలను సేకరించే కాంట్రాక్టర్ వాటిని తీసుకెళ్లి రీసైక్లింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ.. శానిటేషన్ సిబ్బంది ఎక్కడపడితే అక్కడ పారవేయడంతోపాటు వ్యర్థాలు సేకరించాల్సిన కాంట్రాక్టర్లు తీసుకెళ్లడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆస్పత్రి ఆవరణ అంతా కంపుకొడుతోంది.
పట్టించుకోని సెక్యూరిటీ..
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోకి పశువులు, గేదెలు, మేకలు, కుక్కలు, పందులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. వచ్చిన జీవాలు ఆస్పత్ర వ్యర్థాలను తింటున్నా పట్టించుకునే వారు లేకుండాపోయారు. ఆస్పత్రిలోకి జీవాలు రాకుండా మూడు ప్రధాన గేట్లు ఉన్నాయి. ఆ ప్రధాన గేట్ల నుంచి జీవాలు రాకుండా సెక్యూరిటీ గార్డులను కూడా ఆస్పత్రి వర్గాలు నియమించాయి. ఆస్పత్రిలో సుమారు 260 మంది వరకు శానిటేషన్, సెక్యూరిటీ గార్డులు, పేషంట్ కేర్‌లు ఉన్నప్పటికీ గేట్ల వద్ద ఎవ్వరినీ ఉంచని పరిస్థితి ఏర్పడింది. సుమారు 550 పడకల సామర్థ్యం కలిగిన జీజీహెచ్‌కు ప్రతి రోజు 600 వరకు అవుట్ పేషంట్‌లు, 200 వరకు ఇన్‌పేషంట్లు వైద్య సేవలను పొందుతున్నారు. వారందరికీ అందించే సేవల సందర్భంగా పెద్ద ఎత్తున వ్యర్థాలు వెలువడుతుంటాయి. కానీ వాటిని సక్రమంగా తరలించకపోవడం వల్ల జీవాలు ప్రాణాలు కోల్పేయే అవకాశం ఉంది.
న్యూస్‌రీల్
గేదెలు, మేకలు, పందులకు ఆహారంగా మారిన వైనం
ఫ మూగ జీవాలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం
ఫ వ్యర్థాలు తరలింపునకు
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం
ఫ పట్టించుకోని సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓలు

ఆరుబయటే.. ఆస్పత్రి వ్యర్థాలు!

ఆరుబయటే.. ఆస్పత్రి వ్యర్థాలు!

ఆరుబయటే.. ఆస్పత్రి వ్యర్థాలు!