
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
కేతేపల్లి : ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారు నిర్మాణ పనుల వేగవంతంగా పూర్తి చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం కేతేపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నకిరేకల్ నియోజకవర్గంలోని నకిరేకల్, కేతేపల్లి, చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూర్ మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఐకేపీ ఏపీఎంలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఆమె సమీక్షించారు. గ్రామాల్లో వారీగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొన్ని మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి తక్కువగా ఉన్న విషయాన్ని కలెక్టర్ గుర్తించారు. ఈనెల 13వ తేదీ నాటికి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కనీసం 20 శాతం పురోగతి సాధించేలా చూడాలని స్పష్టం చేశారు. అనంతరం వనమహోత్సవం కింద మొక్కలు నాటారు. భూ భారతి దరఖాస్తులపై సమీక్షించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ బి.శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్, నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి