
పదహారు ఆకృతులతో తేలియా రుమాల్‌పై..
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని పుట్టపాక గ్రామానికి చెందిన గూడ పవన్ పదహారు ఆకృతులతో తేలియా రుమాల్ అనే వస్త్రంతో చీర తయారుచేసి కొండ లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపికయ్యారు. ఈ చీర బంతిపూలు, రథం, త్రీడీ డిజైన్‌తో పాటు అనేక డిజైన్‌లతో కూడి ఉంటుంది. మడతలు పడకుండ మృదవైన పట్టును వాడినట్లు ఆయన తెలిపారు. రంగు వెలవని ఈ చీర తయారీకి రూ.75వేలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఇదే చీరకు ఆయన జాతీయ చేనేత అవార్డు కూడా అందుకోనున్నారు. జాతీయ, రాష్ట్ర అవార్డులు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.