
విద్యాహబ్‌గా తీర్చిదిద్దుతాం
నల్లగొండ : నల్లగొండ జిల్లాను విద్యాహబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ సమీపంలోని గంధంవారిగూడెంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులకు ఆయన భూమిపూజ చేసి మాట్లాడారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల రాష్ట్రంలోనే మొదటిది కావాలన్నారు. 9 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌తో పోటీపడి ఈ పాఠశాల నిర్మాణాన్ని తీర్చిదిద్దాలన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, విద్యార్థులు చదువుపైనే దృష్టి పెట్టాలన్నారు. నల్లగొండలో బాలురకు కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు చేస్తామన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నల్లగొండ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను 25 ఎకరాలలో నిర్మించనున్నామని తెలిపారు. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి సంబంధించిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలకు మంచి స్థలాన్ని గుర్తించడం జరిగిందని త్వరలోనే అక్కడ శంకుస్థాపన చ,ఏస్తామన్నారు. టీజీఈడబ్ల్యూఎంఐడీసీ ఈఈ బాలప్రసాద్ నల్లగొండలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల వివరాలను తెలియజేశారు.
క్యాంపు కార్యాలయం అందరిది..
నల్లగొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అందరిదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని క్లాక్‌టవర్ సెంటర్లో రూ.13 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్యాంపు కార్యాలయాన్ని ఆధునాతన సౌకర్యాలతో నిర్మించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు నల్లగొండ వచ్చినప్పుడు ఉండేలా క్యాంపు కార్యాలయాన్ని నిర్మించామన్నారు. ఈ కార్యాలయానికి ‘ఇందిర భవన్’గా నామకరణం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గంలో తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలకు రూ.20 కోట్లు మంజూరు చేస్తూ మంత్రి తన క్యాంపు కార్యాలయంలో మొదటి ఫైల్‌పై సంతకం చేశారు. నార్కట్‌పల్లి పెద్ద చెరువును కూడా నీటితో నింపి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. రూ.1.20 కోట్లతో నిర్మించనున్న బ్రాహ్మణవెల్లెంల గ్రామపంచాయతీ భవనం దక్షిణ భారతదేశంలోనే ఆదర్శంగా ఉండేలా నిర్మించాలని సూచించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో చింతపల్లి, నందిపాడులో రెండు బ్రిడ్జిలను హామ్ విధానంలో చేపట్టనున్నామని, పది రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రధాన రహదారి నుంచి వైటీపీఎస్‌కు రోడ్డు నిర్మాణానికి రూ.260 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయని, భూసేకరణకు రూ. 31 కోట్లను విడుదల చేసామన్నారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, నారాయణ్ అమిత్, ఆర్డీఓ అశోక్ రెడ్డి, డీఈవో భిక్షపతి, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు ఆఫీస్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

విద్యాహబ్‌గా తీర్చిదిద్దుతాం