
ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 99 ఫిర్యాదులు రాగా వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 56, జిల్లా అధికారులకు సంబంధించినవి 43 ఫిర్యాదులు ఉన్నట్లు వెల్లడించారు. అనంతరం ఆమె జిల్లా అధికారుల సమ్మిళిత సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు, పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నందున మండలాల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు దీనిపై దృష్టి పెట్టి పథకాలు వేగవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ సమస్యలను ఎప్పటికప్పుడు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు వారి మండలంలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లను సందర్శించి సమస్యలు లేకుండా చూడాలన్నారు. విద్య, వైద్యం, స్థానిక పరిపాలన అంశాల్లో మండలాల ప్రత్యేక అధికారులది కీలకపాత్ర అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, స్పెషల్ కలెక్టర్ సీతారామారావు, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, ఆర్డీఓలు వై.అశోక్‌రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి