
సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి
శాలిగౌరారం: జిల్లాలోని పీహెచ్‌సీలలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు వైద్య సిబ్బంది నిరంతరం కృషిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శాలిగౌరారంలోని పీహెచ్‌సీ, పీఏసీఎస్, ఎంపీడీఓ కార్యాలయాలు, కేజీబీవీని గురువారం తనిఖీ చేశారు. పలు విషయాలపై ఆరా తీశారు. అనంతరం అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇళ్లు, పీఎం ఆవాస్ యోజన, వన మహోత్సవం తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎరువులు, యూరియా కృత్రి కొరత సృష్టించవద్దన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల గ్రౌండింగ్ త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ అశోక్‌రెడ్డి, హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్, డీఏఓ శ్రవణ్‌కుమార్, తహసీల్దార్ జమీరుద్దీన్, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఏఓ సౌమ్యశృతి, మండల వైద్యాధికారి సూర్యశిల్ప, సిబ్బంది ఉన్నారు.
పాఠాలు బోధించిన కలెక్టర్..
శాలిగౌరారం మండలకేంద్రంలో గురువారం ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి.. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయానికి వెళ్లి విద్యార్థుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి గదికి వెళ్లి పాఠాలు బోధించారు. చాక్‌పీస్ తీసుకొని బోర్డుపై వివిధ సబ్జెక్టుల పాఠ్యాంశాలను రాస్తూ విద్యార్థుల విద్యా సామర్థాలను పరీక్షించింది. అనంతరం విద్యార్థులతో బోర్డుపై రాయిస్తూ సందేహాలను నివృత్తి చేశారు. తల్లిదండ్రుల కలలను నిజం చేసుకునేందుకు కష్టపడి చదవాలని సూచించారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి

సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి