
‘స్థానిక’ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తాచాటాలి
నకిరేకల్ : తెలంగాణలో ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ప్రజలు అసంతృప్తిలో ఉన్నారని.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు అధిక స్థానాలు గెలిచి సత్తాచాటాలని రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్‌ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ పిలుపునిచ్చారు. నకిరేకల్‌లోని సువర్ణ గార్డెన్‌లో గురువారం స్థానిక మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన నిర్వహించిన బీఆర్‌ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మోసం చేసే పనితప్ప మరొకటి లేదన్నారు. కేసీఆర్ పాలనలో దేశంలోనే ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందాయన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్ పాలన కోసం ఎదురు చూస్తున్నారన్నా రు. జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదన్నారు. దమ్ముంటే నియోజకవర్గానికి అధిక నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్‌ఎస్ నాయకులపై కక్షగట్టి అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్ పాలన రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్, మార్కెట్, మున్సిపల్ మాజీ చైర్మన్‌లు కొప్పుల ప్రదీప్‌రెడ్డి, రాచకొండ శ్రీనివాసగౌడ్, మాజీ జెడ్పీటీసీ మాద ధనలక్ష్మి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, నాయకులు మారం వెంకట్‌రెడ్డి, సందినేని వేంకటేశ్వరరావు,సోమ యాదగిరి, పెండెం సదానందం,బుడుగల శ్రీనివాస్‌యాదవ్, పల్లే విజయ్, ౖదైద పరమేషం,సామ శ్రీనివాస్‌రెడ్డి, రాచకొండ వెంకన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే