
చెర్వుగట్టుకు పోటెత్తిన భక్తులు
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీపార్వతి జడలరామలింగేశ్వర స్వామి వారి ఆలయం గురువారం రాత్రి భక్తులతో పోటెత్తింది. అమావాస్య కావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సాయంత్రం నుంచే ఆలయ సన్నిధికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాత్రి ఆలయంలో స్వామివారికి లక్ష పుష్పార్చన ప్రత్యేక పూజలు కొనసాగాయి. భక్తులు స్వామివారి దర్శనానికి వర్షంలో కూడా బారులుదీరారు. వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పూజా కార్యక్రమాల్లో ఈఓ నవీన్‌కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సతీష్ శర్మ, సురేష్ శర్మ, శ్రీకాంత్ శర్మ, భక్తులు పాల్గొన్నారు.