
ఏటీసీని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి
హాలియా : పట్టణంలో నూతనంగా నెలకొల్పిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లో మెషినరీలు ఏర్పాటు చేసినందుకు త్వరగా ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హాలియాలోని ఏటీసీ సెంటర్‌ను బుధవారం వారు పరిశీలించారు. ఏటీసీలో ఉన్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, బ్యాచ్‌ల వివరాలను ఏటీసీ ప్రిన్సిపాల్ మల్లిఖార్జున్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాన్స్‌ఫార్మర్లకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని, రోబొటిక్ ఎక్స్‌లెన్సీ, యంత్ర సామగ్రిని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. అనంతరం ఐటీఐ కళాశాలలో రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. రేషన్‌కార్డులు, ఇళ్లు రాని వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కలెక్టర్‌కు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, గృహ నిర్మాణశాఖ పీడీ రాజ్‌కుమార్, హాలియా మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, నాయకులు మలిగిరెడ్డి లింగారెడ్డి, ఇంచార్జ్ తహసీల్దార్ రఘు ఉన్నారు