
కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి స్వాధీనం
ఫ శ్రావణం.. శుభప్రదం
చేనేత రుణాలు మాఫీచేయాలి
నల్లగొండ టౌన్ : చేనేత సహకార సంఘాల రుణాలను ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం మాఫీ చేయాలని చేనేత సహకార సంఘాల సూర్యాపేట, నల్లగొండ జిల్లాల సమన్వయ కమిటీ అధ్యక్షుడు చిలుకూరి లక్ష్మీనరసయ్య కోరారు. శుక్రవారం నల్లగొండలోని పద్మశాలి భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సహకార సంఘాలలో నేసిన వస్త్రాలు నిలువలు పేరుకుపోయాయన్నారు. వాటిని ధాన్యం తరహాలో ప్రభుత్వం కొనుగోలు చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి టెస్కో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. చేనేత కార్మికులకు రూ.5లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్, సత్యనారాయణ, దత్త గణేష్, నల్ల సత్యనారాయణ, జల్లా నరసింహ, కర్నాటి యాదగిరి, పున్న వెంకటేశం, పుట్టబత్తుల శ్రీనివాస్, కడేరు భిక్షం తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ : మండలంలోని తడకమళ్ల గ్రామంలో సర్వే నంబర్ 719లో కబ్జాకు గురైన భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సబ్‌స్టేషన్‌కు కేటాయించిన ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేసుకోగా ఈనెల 22న ‘సాక్షి’లో ‘సబ్‌స్టేషన్ భూమి కబ్జా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. కబ్జాకు గురైన స్థలాన్ని గురువారం సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఆ స్థలంలో ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ సర్వే నంబర్ 719లో సబ్‌స్టేషన్‌కు కేటాయించిన భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించామని, 1.12 ఎకరాల భూమిని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆ స్థలంలో ప్రభుత్వ భూమి అని బోర్డును ఏర్పాటు చేశామని, ఎవరైనా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్‌ఐ జొన్నపాల కృష్ణయ్య, పోలీస్‌సిబ్బంది ఉన్నారు.

కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి స్వాధీనం

కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి స్వాధీనం