
భవిష్యత్ తరాలకు మొక్కలు అవసరం
నల్లగొండ : భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆమె నల్లగొండలోని మహిళా డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెట్లను నరికి వేయడం, అడవుల నిర్మూలన తదితర కారణాల వల్ల కాలుష్యం పెరిగి మానవ మనుగడకు ముప్పు ఏర్పడుతుందన్నారు. భావి పౌరులైన విద్యార్థులు ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడమే కాకుండా, వాటికి సంరక్షించాలని సూచించారు. మహిళలు బాగా చదువుకోవాలని, చదువు ఒక్కటే సమస్యలకు పరిష్కార మార్గం అన్నారు. మహిళా డిగ్రీ కళాశాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, తెలిపారు. మార్చిలో డిజిటల్ తరగతులను ప్రారంభించామని, బయోటెక్నాలజీ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి