జిల్లా ప్రత్యేక అధికారిగా అనితా రామచంద్రన్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లా ప్రత్యేక అధికారిగా అనితా రామచంద్రన్‌

Jul 26 2025 9:56 AM | Updated on Jul 26 2025 9:56 AM

జిల్ల

జిల్లా ప్రత్యేక అధికారిగా అనితా రామచంద్రన్‌

నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా నల్లగొండ జిల్లాకు ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ అండ్‌ ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనితా రామచందర్‌ను ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించింది.

నాణ్యమైన విద్యనందించాలి

మాడుగులపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. శుక్రవారం మాడుగులపల్లి మండలంలోని కుక్కడం కేజీబీవీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని, పాఠశాల పరిసరాలను పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. కార్యక్రమంలో ఎస్‌ఓ వసంత, సిబ్బంది సునీత ఉన్నారు.

టీబీ వ్యాధి నివారణకు కృషి

నాగార్జునసాగర్‌ : టీబీ వ్యాధి నివారణకు జిల్లాలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్‌ కళ్యాణ చక్రవర్తి తెలిపారు. శుక్రవారం నాగార్జునసాగర్‌లోని అర్బన్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ సెంటర్‌, బస్తీ దావఖానను ఆయన సందర్శించారు. అనంతరం దత్తత తీసుకున్న పేషంట్లకు న్యూట్రిషన్‌ కిట్లను అందజేశారు. టీబీ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. చికిత్స తీసుకుంటే టీబీ పూర్తిస్థాయిలో నయమవుతుందన్నారు. కార్యక్రమంలో సిబ్బంది గంగాబాయి, ఝాన్సీ, లింగయ్య, తిరుమలాచారి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

జీపీఓ పరీక్షకు

ఏర్పాట్లు పూర్తి

నల్లగొండ : గ్రామ పాలనాధికారుల (జీపీఓ) నియామకానికి ఈనెల 27న ననల్లగొండలోని ఎన్జీ కాలేజీలో నిర్వహించే పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తామని.. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాని చేరుకోవాలని సూచించారు.

లబ్ధిదారుల

నమోదు పెంచాలి

మిర్యాలగూడ టౌన్‌ : ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో లబ్ధిదారుల నమోదును పెంచాలని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి కృష్ణవేణి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని వాసవి భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రం ద్వారా అందిస్తున్న పౌష్టికాహారంపై పిల్లలకు తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. పోషణ్‌ అభియాన్‌ డిస్ట్రిక్‌ కో ఆర్డినేటర్‌ సతీష్‌ మాట్లాడుతూ పోషణ ట్రాకర్స్‌ యాప్‌లో సాంకేతిక లోపాల, సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్‌ సీడీపీఓ ఆర్‌.మమత, సూపర్‌వైజర్‌ రాధిక, నాగమణి, లీలాకుమారి, పద్మ, వాణి, హేమాదేవి, మహ్మద్‌ నజీమాబేగం తదితరులున్నారు.

జిల్లా ప్రత్యేక అధికారిగా అనితా రామచంద్రన్‌1
1/3

జిల్లా ప్రత్యేక అధికారిగా అనితా రామచంద్రన్‌

జిల్లా ప్రత్యేక అధికారిగా అనితా రామచంద్రన్‌2
2/3

జిల్లా ప్రత్యేక అధికారిగా అనితా రామచంద్రన్‌

జిల్లా ప్రత్యేక అధికారిగా అనితా రామచంద్రన్‌3
3/3

జిల్లా ప్రత్యేక అధికారిగా అనితా రామచంద్రన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement