
సాగర్‌కు పెరిగిన వరద
నాగార్జునసాగర్ : కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో సాగర్ జలాశయానికి వరద పెరిగింది. ఎగువన ఉన్న జలాశయాలు పూర్తిస్థాయిలో నిండడంతో అదనంగా వచ్చే నీటినంతా దిగువకు విడుదల చేస్తున్నాయి. శ్రీశైలం జలాశయ నీటిమట్టం గరిష్టస్థాయికి చేరువలో ఉండడంతో ఒక క్రస్ట్‌గేటు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. కుడి, ఎడమ విద్యుదుత్పాదనతో కలిసి శ్రీశైలం నుంచి సాగర్‌కు 94,755 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో సాగర్ నీటిమట్టం 570.20 అడుగుల (257.0774 టీఎంసీలు)కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో సాగర్ జలాశయం నుంచి ఎడమ 2,608 క్యూసెక్కులు, విద్యుతుత్పాదనకు 2,627 క్యూసెక్కులు, ఏఎమ్మార్పీకి 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

సాగర్‌కు పెరిగిన వరద