
రేవంత్‌రెడ్డి అన్ని వర్గాలను మోసం చేసిండు
నల్లగొండ టూటౌన్ : ఎన్నికల ముందు అనేక హామీలిచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇలా అన్ని వర్గాలను మోసం చేశాడని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ.9 వేల కోట్లు రైతుబంధు ఇచ్చి గొప్పలు చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు ఎగ్గొట్టిన రైతుబంధు గురించి కూడా చెప్పాలన్నారు. 2 లక్షల ఉద్యోగాలు, పించన్ల పెంపు, మహిళలకు రూ.2500, విద్యార్థులకు స్కూటీలు, రైతు రుణమాఫీ, వంటి హామీలు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి డైవర్షన్ కింగ్ అని, దమ్ము ధైర్యం ఉంటే కులగణన వివరాలు బహిర్గతం చేయాలన్నారు. అంతకుముందు జరిగిన పార్టీ జిల్లా కార్యశాల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.మనోహర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మాదగాని శ్రీనివాస్‌గౌడ్, గోలి మధుసూదన్‌రెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజు యాదవ్, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, బండారు ప్రసాద్, పల్లెబోయిన శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి