
సబ్‌స్టేషన్ భూమి కబ్జా!
మిర్యాలగూడ : సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించిన భూమిని ఓ వ్యక్తి కబ్జా చేశాడు. ఆ భూమిలో పశువుల కోసం గడ్డిని పెంచుతున్నాడు. సదరు భూమి ఆక్రమణ విషయంలో ఘర్షణలు సైతం చోటుచేసుకుని కేసులు కూడా నమోదయ్యా యి. బహిరంగ మార్కెట్‌లో రూ.కోటిపైనే విలువ క లిగిన ఆ భూమిని కాపాడే విషయంలో అధికారులు మిన్నకుండి పోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఓ నాయకుడి సహకారంతో..
మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామ శివారులో సర్వే నంబర్ 719 లో 9.13 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 1990కి ముందు ఆ ప్రాంతంలో సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు 3.20 ఎకరాలను సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం విద్యుత్ శాఖకు కేటాయించారు. గ్రామానికి చెందిన ఐదుగురికి 25 గుంటల చొప్పున లావుణి పట్టాలు ఇచ్చారు. కేటాయించిన స్థలంలోని కొంత భాగంలో సబ్‌స్టేషన్ నిర్మించారు. మిగిలిన స్థలం చుట్టూ ట్రాన్స్‌కో అధికారులు ఎలాంటి హద్దురాళ్లు పాతకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. ప్రస్తుతం భూముల ధరలకు రెక్కలు రావడంతో గత సంవత్సరం ఆ భూమిపై గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కన్ను పడింది. అనుకున్నదే తడువుగా సదరు వ్యక్తి ఆ భూమిని కాజేసేందుకు పక్కా ప్రణాళిక రచించాడు. నేర చరిత్ర కలిగిన ఆ వ్యక్తి.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన (మాజీ సర్పంచ్) రాజకీయ నాయకుడితో కుమ్మకై ్క సబ్‌స్టేషన్ భూమిని కబ్జా చేశాడు. పక్కనే ఉన్న ఎన్‌ఎస్పీ కాల్వను సైతం ఆక్రమించుకుని సాగు చేస్తున్నాడు. అందుకు ప్రతిఫలంగా రూ.8 లక్షలు సదరు మాజీ సర్పంచ్‌కు ముట్టజెప్పినట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అక్కడ 20 గుంటల భూమిని ప్రభుత్వ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసేందుకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సదరు నాయకుడి చేత ఆ ఉత్తర్వులను సైతం రద్దు చేయించి ఆ భూమిని సైతం కబ్జా చేశాడు. ఇలా కబ్జా చేసిన రెండున్నర ఎకరాల చుట్టూ దర్జాగా కంచె వేసి పశువుల కోసం పచ్చి గడ్డిని పెంచుతున్నాడు.
హద్దులు పరిశీలించి ఫిర్యాదు చేస్తాం
తడకమళ్ల సబ్‌స్టేషన్ భూమి కబ్జాకు గురైన విషయం నా దృష్టికి వచ్చింది. సబ్‌స్టేషన్‌కు సంబధించిన భూమి హద్దులు పరిశీలించి కబ్జాపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. అనంతరం చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాసాచారి,
ట్రాన్స్‌కో డీఈ, మిర్యాలగూడ
భూ కబ్జాపై విచారణ చేస్తాం
మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామ శివారులో గల 719 సర్వే నంబర్‌లో సబ్ స్టేషన్‌కు కేటాయించిన భూమిలో 2.5 ఎకరాలు కబ్జాకు గురైనట్లు మాకు సమాచారం లేదు. ట్రాన్స్‌కో అధికారులు ఫిద్యుదు చేస్తే భూ కబ్జా విషయంపై సమగ్ర విచారణ జరిపి కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– సురేష్‌కుమార్, తహసీల్దార్, మిర్యాలగూడ
కబ్జా చేశాడిలా..
సబ్‌స్టేషన్ స్థలాన్ని కాజేసేందుకు సదరు వ్యక్తి.. ఓ మండల నాయకుడితో కలిసి పక్కా స్కెచ్ వేశాడు. ముందుగా గ్రామంలో ఓ కులస్తులతో రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారిని ఆ భూమిపైకి పంపి భూమిలో చెట్లను తొలగించడం, మడులుగా చేయడం వంటి పనులు చేయించాడు. విషయాన్ని తెలుసుకున్న గ్రామానికి చెందిన మరికొందరు ఆ భూమి తమదేనని వారితో గొడవలకు దిగారు. ఈ ఘర్షణలో ఇరువర్గాలు కేసులు పెట్టుకున్నాయి. ఈ కేసులో సదరు వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైనట్లు తెలిసింది. దీంతో ఆ వ్యక్తి ఇరువర్గాలకు కొంత మొత్తం ముట్టజెప్పి ఆ భూమిని కబ్జా చేశాడు. ఇలా గ్రామంలో గొడవలు సృష్టించి సబ్‌స్టేషన్ స్థలాన్ని చాకచక్యంగా కబ్జా చేశాడని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికై నా సంబంధిత శాఖ అధికారులు చొరవ తీసుకుని కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకుని హద్దురాళ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఫ తడకమళ్లలో రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ఓ వ్యక్తి
ఫ పట్టించుకోని రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు
ఫ ఆ భూమి విలువ రూ.కోటిపైనే..