
స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి
హాలియా : త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఏఐసీసీ సెక్రటరీ, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి సంపత్‌కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం హాలియా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్‌తో కలిసి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. సంస్ధాగతంగా కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టంగా చేయాలని కోరారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రజలకు అందే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర పీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు గోపగాని మాధవి, పున్న కైలాష్, పసుపులేటి సైదయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుందూరు వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, అంకతి సత్యం, కర్నాటి లింగారెడ్డి, కాకునూరి నారాయణగౌడ్, ఆంగోతు భగవాన్‌నాయక్, వెంపటి శ్రీనివాస్, గౌనీ రాజారమేష్‌యాదవ్, కుకుడాల ఆంజనేయులు, చంద్రశేఖర్, పగడాల నాగరాజు, బానుచందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
పార్టీని బలోపేతం చేయాలి
దేవరకొండ : కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని ఇందుకుగాను గ్రామస్థాయి నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం దేవరకొండలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అధ్యక్షతన జరగిన నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఎంపిక చేసే అభ్యర్థులను గెలిపించే బాధ్యత ప్రతిఒక్క కాంగ్రెస్ కార్యకర్తపై ఉందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, మార్కెట్ చైర్మన్లు నాయిని మాధవ రెడ్డి, సంజీవ్‌రెడ్డి, నాసిర్‌అహ్మద్, ఎంఏ సిరాజ్‌ఖాన్, ఆలంపల్లి నర్సింహ, దూదిపాళ్ల వేణుధర్‌రెడ్డి, ముక్కమళ్ల వెంకటయ్య, రుక్మారెడ్డి, దేవేందర్ నాయక్, కిన్నెర హరికృష్ణ, కొర్ర రాంసింగ్ పాల్గొన్నారు.
ఫ ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్