
నీటి వృథాను అరికట్టాలి
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఫ మద్రాస్ ఐఐటీ బృందంతో సమావేశం
నల్లగొండ : నీటి వృథాను అరికట్టి.. ప్రయోగాత్మక పద్ధతి ద్వారా సక్రమ నీటి నిర్వహణకు ముందుకొచ్చిన మద్రాస్ ఐఐటీ బృందానికి అన్ని శాఖల అధికారులు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మద్రాస్ ఐఐటీ బృందం, తాగునీటి సరపరా, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామీణ తాగునీటి సరఫరా, పంచాయతీరాజ్, ఇతర శాఖలు ఐఐటీ బృందానికి సహకరించాలని ఆదేశించారు. బృందం సభ్యులు మాట్లాడుతూ తాగునీటి వృథాను అరికట్టేలా ‘ఐ ట్యాంక్’ యాప్‌ను రూపొందించి వినియోగిస్తున్నట్లు కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, డీపీఓ వెంకయ్య, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ఎం.శాంతకుమారి, మద్రాస్ ఐఐటీ బందం ప్రతినిధి సాయి తదితరులు పాల్గొన్నారు.