
సాగర్ రహదారిపై మూలమలుపుల పరిశీలన
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ నేషనల్ హైవేపై బ్లాక్‌స్పాట్లను ఎస్పీ శరత్‌చంద్ర పవార్ శుక్రవారం పరిశీలించారు. ఇటీవల ఈ మార్గంలో తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలు పోలీస్‌శాఖను ఆందోళనకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో ‘సాక్షి’లో వరుస కథనాలు వెలువడ్డాయి. దీంతో స్పందించిన ఎస్పీ శుక్రవారం ఆ ప్రాంతాలను సందర్శించి ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ వార్నింగ్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, స్ట్రీట్ లైట్ల ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. అవసరమైన చోట రోడ్డు వెడల్పు అంశాన్ని చర్చించారు. ఎస్పీ వెంట సీఐ అంజయ్య, నేషనల్ హైవే డీఈ మురళీకృష్ణ, ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ ఎస్‌ఈ వి.గీత, ఏఈ కె.శేఖర్, ఫారెస్ట్ అధికారి రావేందర్‌రావు, ఎంవీఐ సతీష్, ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ కల్పన, సాగర్ సీఐ శ్రీనునాయక్ ఎస్‌ఐ ముత్తయ్య ఉన్నారు.